రేటు రెండింతలు! | Does Kangana Ranaut deserve Rs 6 crore for her next film | Sakshi
Sakshi News home page

రేటు రెండింతలు!

Jul 4 2015 10:57 PM | Updated on Sep 3 2017 4:53 AM

రేటు రెండింతలు!

రేటు రెండింతలు!

మార్కెట్ ఉన్నప్పుడే పారితోషికం పెంచాలి... లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే బెట్టు చేయాలి... కొంతమంది తారలు ఫాలో

మార్కెట్ ఉన్నప్పుడే పారితోషికం పెంచాలి... లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే బెట్టు చేయాలి... కొంతమంది తారలు ఫాలో అయ్యే సూత్రాలివి. తాజాగా ఈ జాబితాలో కంగనా రనౌత్ కూడా చేరిపోయారు. వరుస విజయాలతో పట్టరానంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంగనా, తన మార్కెట్‌ని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటివరకూ ఆమె ఒక సినిమాకి దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకునేవారట. కానీ ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ రెండు భాగాలు.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు కాబట్టి, పారితోషికం పెంచాలనుకున్నారట.
 
 మూడు కోట్లకు అదనంగా ఇంకో అర కోటి, ఒక కోటీ కాదు.. ఏకంగా రేటు రెండింతలు చేసేశారట. ఒక సినిమాకి ఆరు కోట్లు ఇస్తేనే అంగీకరిస్తా, లేకపోతే వేరే కథానాయికను చూసుకోండి అని నిర్మొహమాటంగా చెబుతున్నారని హిందీ రంగంలో ఓ వార్త ప్రచారమవుతోంది. కొంచెం అటూ ఇటూగా ఐదు కోట్లకు ఒప్పుకోండి మేడమ్ అంటే.. అలా అడగడానికి ఎంత ధైర్యం అన్నట్లు నిర్మాతల వైపు గుర్రుగా చూస్తున్నారట కంగనా. ఏం చేస్తాం? అంతా మార్కెట్ మహిమ అని నిర్మాతలు చెప్పుకుంటున్నారని భోగట్టా. చివరికి కంగనా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement