కొత్త విషయాలు నేర్చుకున్నా | Director Sridhar about Ye Mantram Vesave Movie | Sakshi
Sakshi News home page

కొత్త విషయాలు నేర్చుకున్నా

Mar 9 2018 1:29 AM | Updated on Mar 9 2018 1:29 AM

Director Sridhar about Ye Mantram Vesave Movie  - Sakshi

శ్రీధర్‌ మర్రి

‘‘ఒక కాన్సెప్ట్‌తో సినిమా చేశాం. ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితే హ్యాపీ. లేకపోతే నా ఐడియాలజీని పరిశీలించుకుని, తప్పులను దిద్దుకుని మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఈరోజు సినిమా రిలీజ్‌ అవుతున్నా నాకు ఆత్రుత, భయం లేవు. ఈ చిత్రం విడుదల ఆలస్యం అయినందుకు బాధగా లేదు. ‘ఏ మంత్రం వేశావె’ సినిమా జర్నీలో కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీధర్‌ మర్రి. విజయ్‌ దేవరకొండ, శివానీ సింగ్‌ జంటగా శ్రీధర్‌ మర్రి స్వీయ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ సమర్పణలో రూపొందిన ‘ఏ మంత్రం వేశావె’ సినిమా ఈ రోజు విడుదల కానుంది. శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో మనం టెక్నాలజీని కంట్రోల్‌ చేస్తున్నామా? లేక టెక్నాలజీ మనల్ని కంట్రోల్‌ చేస్తుందా? అనే పాయింట్‌పై రూపొందించిన చిత్రమిది.

గేమ్‌కు ఎడికై్ట ఉన్న క్యారెక్టర్‌లో హీరో విజయ్‌ కనిపిస్తారు. అలాంటి వ్యక్తి నార్మల్‌ లైఫ్‌లోకి ఎలా వచ్చాడన్నదే కథాంశం. ‘పెళ్లి చూపులు’ సినిమాకు ముందే ఈ కథను విజయ్‌ దేవరకొండకు చెప్పాను. సినిమాపై నమ్మకంతో శివకుమార్‌గారు వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు’’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ చిత్రంలో  అమృతగా నటించిన చిన్నారి గుర్తుందా? ఆ పాప అసలు పేరు కీర్తన. నటుడు పార్తీబన్, నటి సీత కూతురు. కీర్తనకి ఇప్పుడు పాతికేళ్ల వయసు. ఎడిటర్‌ శ్రీకర ప్రసాద్‌ తనయుడు, దర్శకుడు అక్షయ్‌ని కీర్తన గురువారం పెళ్లాడింది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement