ఉదయం ఆట ఉచితం | Director Rettadi Srinivas about IPC Section Bharya Bandhu | Sakshi
Sakshi News home page

ఉదయం ఆట ఉచితం

Jun 28 2018 12:16 AM | Updated on Jun 28 2018 12:16 AM

Director Rettadi Srinivas about IPC Section Bharya Bandhu - Sakshi

‘‘దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేను ‘ఐపీసీ సెక్షన్‌ భార్యాబంధు’ వంటి మంచి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశం ఆధారంగా రూపొందిన సందేశభరిత వినోదాత్మక చిత్రమిది’’ అని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్‌ అన్నారు. శరత్‌ చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్రలో రెట్టడి శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్‌ భార్యాబంధు’ రేపు రిలీజ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా రెట్టడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ మినహా మా చిత్రం ఆడుతున్న అన్ని థియేటర్స్‌లో ఇది వర్తిస్తుంది. సినిమాపై నమ్మకంతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే ఆలోచనతో సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమనిగారి పాత్ర హైలైట్‌. మా సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement