15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో' | Director Neelakanta Palaning for show sequal after 15 years | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో'

May 4 2017 1:43 PM | Updated on Sep 15 2018 2:28 PM

15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో' - Sakshi

15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో'

2002లో కేవలం రెండే పాత్రలతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా షో. సూపర్ స్టార్ వారసురాలు మంజుల, విలక్షణ నటుడు

2002లో కేవలం రెండే పాత్రలతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా షో. సూపర్ స్టార్ వారసురాలు మంజుల, విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన షో విశ్లేషకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమా దర్శకుడు నీలకంఠ ఒక్కసారి సినీవర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్సమ్మ మంచి విజయం సాధించినా.. ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు.

చమ్మక్ చల్లో, మాయ లాంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో కొంత గ్యాప్ తీసుకున్న నీలకంఠ, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన షో సినిమాకు సీక్వల్ రూపొందించే పనిలో ఉన్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత సెకండ్ షో పేరుతో షో సినిమాకు సీక్వల్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement