అచ్చం నాలాగే షాట్లు కొట్టాడు: ధోనీ | Dhoni was surprised to see Sushant emote him well on screen | Sakshi
Sakshi News home page

అచ్చం నాలాగే షాట్లు కొట్టాడు: ధోనీ

Aug 20 2016 7:42 PM | Updated on Sep 4 2017 10:06 AM

అచ్చం నాలాగే షాట్లు కొట్టాడు: ధోనీ

అచ్చం నాలాగే షాట్లు కొట్టాడు: ధోనీ

'ఎంఎస్ ధోనీ' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుట్.. తెరపై మహీలా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు.

ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎంఎస్ ధోనీ' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుట్.. తెరపై మహీలా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ధోనీలా నటించడం, బ్యాటింగ్ చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ముఖ్యంగా ధోనీ మార్క్ హెలికాప్టర్ షాట్లను తెరమీద అద్బుతంగా పండించాడట. సుశాంత్ బ్యాటింగ్ స్కిల్స్ చూసి ధోనీ ఆశ్చర్యపోయాడు. తన పాత్రలో సుశాంత్ బాగా నటించాడని ధోనీ కితాబిచ్చాడు.

ఈ సినిమా వచ్చే నెల 30న విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్ విడులైంది. 'ఈ సినిమా కోసం సుశాంత్ కష్టపడి పనిచేశాడు. తొమ్మిదినెలలకుపైగా రోజూ మూడుగంటలకు పైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నాలాగే షాట్లు కొట్టాడు' అని ధోనీ చెప్పాడు. మైదానంలో గెలుపోటములకు అతీతంగా వ్యవహరించే 'మిస్టర్ కూల్' ధోనీలా తెరపై కనిపించేందుకు సుశాంత్ బాగా సాధన చేశాడు. ధోనీలా నడవడం, మాట్లాడటం కోసం చాలా ప్రాక్టీస్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement