దేవుడు... దెయ్యం... మనిషి | devudu deyyam manishi is an upcoming telugu film | Sakshi
Sakshi News home page

దేవుడు... దెయ్యం... మనిషి

Sep 26 2013 1:34 AM | Updated on Aug 28 2018 4:30 PM

దేవుడు... దెయ్యం... మనిషి - Sakshi

దేవుడు... దెయ్యం... మనిషి

మనిషి దేవుడికి భయపడతాడు. దెయ్యానికి భయపడతాడు. ఈ భయాలతో అసలు మనిషి పయనం ఎటువైపు వెళుతుంది? ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘దేవుడు... దెయ్యం... మనిషి’. కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ దర్శకుడు.

మనిషి దేవుడికి భయపడతాడు. దెయ్యానికి భయపడతాడు. ఈ భయాలతో అసలు మనిషి పయనం ఎటువైపు వెళుతుంది? ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘దేవుడు... దెయ్యం... మనిషి’. కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ దర్శకుడు. 
 
ఎస్.ఎస్.ఎన్.మూవీస్ పతాకంపై కేశనకుర్తి శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రాంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు ప్రేమ్‌రాజ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ ఇచ్చారు. 
 
భద్రాచలం, మణుగూరు, పాపికొండలు తదితర ప్రాంతాల్లో 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల శిరీష్, తులసి, నరేష్, మనస్విని సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: కోట తిరుపతిరెడ్డి, బేబి హరితశ్రీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement