దమ్ముందా?

Dammunte Sommera Movie Press Meet  - Sakshi

ప్రముఖ హాస్యనటుడు సంతానం, అంచల్‌ సింగ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. రామ్‌బాల దర్శకత్వంలో శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో నటరాజ్‌  ఈ నెల 22న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ– ‘‘హాస్యనటుడిగా అలరించిన సంతానం హీరోగానూ అలరిస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో రిలీజ్‌ అవుతోన్న తొలి సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ కృష్ణా ఫిలింస్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: దీపక్‌ కుమార్‌ పతి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top