పుకార్లు సృష్టించకండి : రానా | Daggubati Rana Clarification On Rumours About Health Issues | Sakshi
Sakshi News home page

Jun 24 2018 10:39 AM | Updated on Jun 24 2018 10:48 AM

Daggubati Rana Clarification On Rumours About Health Issues - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో రానా ఆరోగ్య పరిస్థితిపై కొద్దిరోజులుగా రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. కంటి సమస్యతో బాధపడుతున్నాడన్న వార్తలు ప్రముఖంగా వినిపించగా తీవ్ర సమస్యలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంపై దగ్గుబాటి కుటుంబ సభ్యుల ఒకటి రెండు సార్లు స్పందించిన రూమర్స్‌ మాత్రం అలాగే కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా తండ్రి సురేష్‌ బాబు, రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని త్వరలోనే చికిత్స ప్రారంభమవుతుందని చెప్పటంతో పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

తాజాగా ఈ వార్తలపై హీరో రానా స్పందించాడు. ‘నా ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నేను బాగానే ఉన్నా... కేవలం బీపీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నా. కొద్ది రోజుల్లో అంతా సెట్‌ అవుతుంది. మీ ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు.’ అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు రానా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement