డేర్ డెవిల్! | Commando 2 is my career's toughest role so far: Adah Adah Sharma | Sakshi
Sakshi News home page

డేర్ డెవిల్!

Sep 19 2016 12:16 AM | Updated on Sep 4 2017 2:01 PM

డేర్ డెవిల్!

డేర్ డెవిల్!

పిట్టగోడ మీద నిలబడటమంటేనే పెద్ద సాహసం. ఇక.. యోగా చేస్తే? ప్రాణాలతో చెలగాటమాడినట్లే.

 పిట్టగోడ మీద నిలబడటమంటేనే పెద్ద సాహసం. ఇక.. యోగా చేస్తే? ప్రాణాలతో చెలగాటమాడినట్లే. గుండె నిండా ధైర్యం ఉన్నవాళ్లే ఆ సాహసం చేయగలుగుతారు. అలాంటివాళ్లను ‘డేర్ డెవిల్’ అనాల్సిందే. ఇప్పుడు చాలామంది అదా శర్మను ఇలానే అంటున్నారు. దానికి కారణం పిట్టగోడ మీద ఆమె చేసిన యోగానే. యోగా అంటే విశాలమైన ప్రాంతంలో చేస్తారు. దాదాపు ఒక్క అడుగు వెడల్పు ఉన్న పిట్టగోడ మీద అదా యోగా చేశారు.
 
 ఎందుకీ రిస్క్ అనుకుంటున్నారా? హిందీలో ‘కమాండో 2’ అనే చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో రిస్కీ ఫైట్స్ చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. పిట్టగోడ మీద చేసే రిస్కీ ఫైట్స్ కోసమే ఇలా యోగా ప్రాక్టీస్ చేశారు. చేసే పని మీద ఎంతో ప్రేమ, అంకితభావం ఉంటేనే ఈ రేంజ్‌లో రిస్క్ తీసుకుంటారు.
 
  పిట్టగోడ మీద తాను చేసిన విన్యాసాలను షూట్ చేసి, ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు అదా శర్మ. పిల్లలెవరైనా తనను ఆదర్శంగా తీసుకుని, ట్రై చేస్తారేమోనని భావించారేమో... ‘ఇంట్లో ఇలాంటివి ట్రై చేయొద్దు’ అని పేర్కొన్నారు. ఈ పిట్టగోడ ఉన్నది 24వ అంతస్తులో. అక్కణ్ణుంచి కింద చూస్తేనే కళ్లు తిరుగుతాయ్. దమ్మున్న వాళ్లు చేస్తారేమో కానీ... యోగా ఎవరు చేస్తారమ్మా?... అదా.. అదరగొట్టేశావ్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement