చాలా కష్టం! | Adah Sharma gets into action mode | Sakshi
Sakshi News home page

చాలా కష్టం!

Apr 30 2016 10:53 PM | Updated on Sep 3 2017 11:07 PM

చాలా కష్టం!

చాలా కష్టం!

కత్తిలాంటి ఫిజిక్‌తో కుర్రకారుని ఆకట్టుకునే అందాల నాయికలు కత్తి చేతబట్టి ఫైట్లు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటుంది.

కత్తిలాంటి ఫిజిక్‌తో కుర్రకారుని ఆకట్టుకునే అందాల నాయికలు కత్తి చేతబట్టి ఫైట్లు చేస్తే చూడ్డానికి బాగానే ఉంటుంది. అనుష్క, తమన్నా వంటి తారలు యాక్షన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదా శర్మ కూడా ఈ లిస్టులో చేరారు. ‘ఫోర్స్’ ఫేమ్ విద్యుత్ జామ్వాల్ హీరోగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘కమాండో’కు సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రంలో అదాను కథానాయికగా అడిగారట. మొద ట్లో సోనాక్షీ సిన్హాను అనుకున్నా, ఆ తర్వాత ఈ అవకాశం అదాను వరించింది. ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా కష్టమైన సినిమా ఇదనీ, ఇందులో ఫైట్స్ కూడా చేస్తాననీ అదా పేర్కొన్నారు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement