సమస్యలతో పోరు | Close Friends Promotional Song | Sakshi
Sakshi News home page

సమస్యలతో పోరు

Oct 27 2014 11:30 PM | Updated on Sep 2 2017 3:28 PM

సమస్యలతో పోరు

సమస్యలతో పోరు

నందు, మధునందన్, అభిషేక్ మహర్షి, మధురిమ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘క్లోజ్‌ఫ్రెండ్స్’. అరుణ్ పవార్ దర్శకుడు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత.

నందు, మధునందన్, అభిషేక్ మహర్షి, మధురిమ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘క్లోజ్‌ఫ్రెండ్స్’. అరుణ్ పవార్ దర్శకుడు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత. మారుతి టీమ్ వర్క్స్, సినిమా లవర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రచార గీతాన్ని మారుతి చేతుల మీదుగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మలయాళ చిత్రానికి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. అరుణ్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మారుతి తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న ప్రాణమిత్రులు... ఆ సమస్యలతో పోరు సాగించి, ఎలా బయటపడ్డారనేది ప్రధానాంశమనీ, పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. తన కెరీర్‌లోనే ఇదొక ప్రత్యేకమైన చిత్రమని నందు అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement