ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’  చూశారా! | Facebook introduces Threads from Instagram | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’ చూశారా!

Oct 4 2019 10:51 AM | Updated on Oct 4 2019 10:57 AM

Facebook introduces Threads from Instagram - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం తన ప్రత్యర్థి స్పాప్‌చాట్‌తో  సోషల్ మీడియా సమరానికి సై అంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ "థ్రెడ్స్" ను  లాంచ్‌ చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్, షేర్ లొకేషన్,  బ్యాటరీ స్టేటస్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చని  ఫేస్‌బుక్‌ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ తీసుకొచ్చినట్టు తెలిపింది. 

ఫేస్‌బుక్ దాని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయాన్ని ఆర్జిస్తున్న  ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి సారించింది, ఎందుకంటే దాని ప్రధాన వేదిక గోప్యత , తప్పుడు సమాచారం లేదా నకిలీ వార్తల వ్యాప్తికి సంబంధించి నియంత్రకుల నుండి పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొత్త అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఈ నేపథ్యంలో  థ్రెడ్స్‌ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.  యాపిల్,  గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా  దీన్ని ఆవిష్కరించింది. ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్‌ చాలా సురక్షితమైందని ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది. 
 
థ్రెడ్స్‌ ఒక స్వతంత​ యాప్‌. ఇతర మెసేజ్‌ యాప్‌ల  మాదిరిగానే వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, సందేశాలు, స్టోరీస్‌ను షేర్‌ చేసుకోవచ్చు. విజువల్ మెసేజింగ్ స్టైల్‌లో ఫోటోలు లేదా వీడియోలను సులభంగా భాగస్వామ్యం చేస్తుంది. అలాగే తమ పోస్ట్‌లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో  "క్లోజ్ ఫ్రెండ్స్" ఫీచర్‌ ద్వారా నియత్రించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇన్‌బాక్స్ , నోటిఫికేషన్‌లు ఉంటాయి. 
డైరెక్టుగా కెమెరాతో ఒపెన్‌ అయ్యి షార్ట్‌కట్స్‌తో కేవలం రెండే రెండు క్లిక్స్‌ తాము అనుకున్న కంటెంట్‌ను యాడ్‌ చేయొచ్చు. అలాగే వాట్సాప్‌ మాదిరిగానే స్టేటస్‌ ఫీచర్‌ కూడా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement