చాయ్ 10పైసలు.. భోజనం రూపాయ్! | Campus Ampasayya Releasing On 29th July | Sakshi
Sakshi News home page

చాయ్ 10పైసలు.. భోజనం రూపాయ్!

Jul 19 2016 11:52 PM | Updated on Sep 4 2017 5:19 AM

చాయ్ 10పైసలు.. భోజనం రూపాయ్!

చాయ్ 10పైసలు.. భోజనం రూపాయ్!

నిజమే.. చాయ్ పది పైసలు మాత్రమే. ఒక్క రూపాయి పెడితే కడుపు నిండుతుంది. మార్లిన్ మన్రో మ్యాగజైన్ మూడు రూపాయలు.

నిజమే.. చాయ్ పది పైసలు మాత్రమే. ఒక్క రూపాయి పెడితే కడుపు నిండుతుంది. మార్లిన్ మన్రో మ్యాగజైన్ మూడు రూపాయలు. ఇది 1969లో ముచ్చట. కానీ, చేతిలో ఐదు రూపాయలు లేని ఓ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఏం చేశాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్-అంపశయ్య’.
 
 శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించారు. విజయలక్ష్మి జైని నిర్మాత. ఓ ప్రధాన పాత్రలో నటిస్తూ, ప్రభాకర్ జైని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ప్రభాకర్ జైని మాట్లాడుతూ - ‘‘1965- 70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది.
 
 నవలలోని ఆత్మను సంఘటనల రూపంలో ఆవిష్కరించడానికి మూడేళ్లు పట్టింది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఆకెళ్ల రాఘవేంద్ర, స్వాతీ నాయుడు తదితరులు నటించి న ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement