బన్నీ కూడా ఆ పని చేస్తున్నాడు | bunny croons for sarainodu | Sakshi
Sakshi News home page

బన్నీ కూడా ఆ పని చేస్తున్నాడు

Feb 12 2016 4:20 PM | Updated on Sep 3 2017 5:31 PM

బన్నీ కూడా ఆ పని చేస్తున్నాడు

బన్నీ కూడా ఆ పని చేస్తున్నాడు

ఇటీవల కాలంలో మన హీరోలో కేవలం యాక్టింగ్తోనే సరిపెట్టేయంలేదు. తమ అభిమానులను అలరించడానికి అప్పుడప్పుడు గాయకులుగా కూడా మారిపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్...

ఇటీవల కాలంలో మన హీరోలు  కేవలం యాక్టింగ్తోనే సరిపెట్టేయంలేదు. తమ అభిమానులను అలరించడానికి అప్పుడప్పుడు గాయకులుగా కూడా మారిపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్లు గళాలు సవరించుకోగా, తాజాగా ఆ లిస్ట్లో మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. ఇప్పటి వరకు తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న బన్నీ, త్వరలో సింగర్గా కూడా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బన్నీ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అల్లు అర్జున్ గొంతు కలుపుతున్నాడట. బన్నీ కోసం సూపర్ ట్యూన్ను సిద్ధం చేసిన సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే ఆ పాటను రికార్డ్ కూడా చేశాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు నటుడిగా మెప్పించిన బన్నీ, గాయకుడిగా ఎన్ని మార్కులు సాధిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement