ఈ ప్రశంసలన్నీ శింబూకే..!
బొద్దుగా ఉండే హన్సిక కాస్తా... ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయింది. చిక్కిన అందంతో చెక్కిన శిల్పంగా మారిన హన్సిక డేట్ల కోసం తమిళ, తెలుగు నిర్మాతలు ‘క్యూ’ కడుతున్నారు.
బొద్దుగా ఉండే హన్సిక కాస్తా... ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయింది. చిక్కిన అందంతో చెక్కిన శిల్పంగా మారిన హన్సిక డేట్ల కోసం తమిళ, తెలుగు నిర్మాతలు ‘క్యూ’ కడుతున్నారు. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇంతకీ ఉన్నట్లుండి హన్సిక చిక్కడానికి కారణం ఏంటా? అనుకుంటున్నారా! దీని వెనుక శింబు హస్తం ఉందట.
ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఎంతమంది చెప్పినా తన బొద్దు తనాన్ని వీడని హన్సిక... శింబు చెప్పగానే అమాంతం తగ్గిపోయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. దీని గురించి ఇటీవల హన్సిక మాట్లాడుతూ -‘‘మంచి అనేది ఎవరు చెప్పినా వినడం తప్పు కాదు కదా. మొన్నటిదాకా ‘బొద్దుగా ఉంటే బాగుంటావ్’ అన్నవాళ్లందరూ... ‘స్లిమ్ అయ్యాక ఇంకా బాగున్నావ్’ అంటున్నారు.
ఏది ఏమైనా... నాకు దక్కుతున్న ప్రశంసలన్నీ శింబూకే చెందుతాయి’’ అంటూ అందంగా నవ్వేశారట. తమ ప్రేమ వ్యవహారం నిజమే అని మీడియా సాక్షిగా ఇటీవల ఈ జంట అంగీకరించిన విషయం తెలిసిందే. కాబోయే భార్య మంచిచెడ్డలను అప్పుడే చూసేసుకుంటున్నాడు శింబు అని కోలీవుడ్‌లో అందరూ చెవులు ముసిముసిగా నవ్వుకుంటున్నారట.