‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’ | Bottle Cap Challenge Salman Khan Says Donot Thakao Paani Bachao | Sakshi
Sakshi News home page

సందేశాత్మకంగా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ పూర్తి చేసిన సల్మాన్‌

Jul 15 2019 1:15 PM | Updated on Jul 15 2019 3:22 PM

Bottle Cap Challenge Salman Khan Says Donot Thakao Paani Bachao - Sakshi

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం వరకూ ‘కీకీ చాలెంజ్‌’, ‘10 ఇయర్స్‌ చాలెంజ్‌’ అంటూ వివిధ రకాల చాలెంజ్‌లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’ చేరింది. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న ఈ ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్’లో సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది పాల్గొన్నారు.

అయితే వీరిలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్‌లు విజయవంతంగా బాటిల్‌ క్యాప్‌ను ఒకే కిక్‌తో​ తీశారు. మరి కొందరేమో చేత్తో మూత తీసి నీళ్లు తాగేసి గెలిచేశాం అని చెప్పుకొన్నారు. అయితే వీరందరి కంటే కాస్త భిన్నంగా ఈ చాలెంజ్‌ని పూర్తి చేశారు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. అంతేకాక బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ ద్వారా అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు సల్మాన్‌. చాలెంజ్‌లో భాగంగా బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అన్నారు సల్మాన్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 60 వేల మందికిపైగా లైక్‌ చేశారు. సల్మాన్‌ సందేశాన్ని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement