కంటతడి పెట్టుకున్న బోనీ కపూర్‌!

Boney Kapoor Was Become Emotional At IIFA Awards - Sakshi

శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్‌ పలు సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. జాతీయ చలన చిత్ర అవార్డు వేడుకల్లో బోనీ కపూర్‌ శ్రీదేవి తరుపున అవార్డు తీసుకుంటూ.. ఎమోషనల్‌ అయ్యారు. తాజాగా ఐఫా వేడుకల్లో బోనీ కపూర్‌ స్టేజ్‌పైనే కన్నీటిపర్యంతమయ్యారు. 

శ్రీదేవి గతేడాది నటించిన మామ్‌ చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డును శ్రీదేవి తరుపున బోనీ కపూర్‌ అందుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ.. ‘నిన్ను ప్రతీక్షణం మిస్సవుతున్నాను’ అంటూ కళ్లు చెమర్చగా... అర్జున్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌లు వచ్చి బోనీ కపూర్‌ను ఓదార్చుతూ..  ప్రపంచం, భారతదేశం..మా కుటుంబాలు శ్రీదేవీని ఎప్పటికీ మరిచిపోలేమని అనిల్‌ కపూర్‌ అన్నారు. దుబాయ్‌లో పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి ప్రమాదావశాత్తు బాత్‌రూం టబ్‌లో పడి  ఫిబ్రవరి 24న మరణించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top