తమిళంలో తొలిసారి

డాక్టర్ లింగం మావయ్యగా ‘శంకర్ దాదా’ సిరీస్‌లో కామెడీ పండించారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఇప్పుడు తమిళంలో తన విలనీ సైడ్ చూపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. సూర్య హీరోగా ‘గురు’ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూరరై పోట్రు’. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పరేశ్ రావల్ విలన్‌గా నటించనున్నారని టాక్. ఇది ఆయనకు తొలి తమిళ చిత్రం అవుతుంది. ఆర్మీ కెప్టెన్, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిసింది. సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పొవెల్ ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి