పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్ | Bipasha Basu ducks question on marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్

Mar 31 2016 8:31 PM | Updated on Sep 3 2017 8:57 PM

పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్

పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బిపాసా, కరణ్‌కు నిశ్చితార్థం అయిందని, ఏప్రిల్ 30న ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన బిపాసాను మీడియా ప్రతినిధులు పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. పెళ్లి ఎప్పుడు జరిగితే, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పింది. కాగా కరణ్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement