‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’ | Bigg Boss 3 Telugu: Today Bigg Boss Grand Finale | Sakshi
Sakshi News home page

‘షూటింగ్‌ మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

Nov 3 2019 12:33 PM | Updated on Nov 3 2019 5:04 PM

Bigg Boss 3 Telugu: Today Bigg Boss Grand Finale - Sakshi

17 మంది కంటెస్టెంట్లు... మిగిలింది అయిదుగురు ఇంటి సభ్యులు. జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ 3 తెలుగు నేడు అంతే ఘనంగా ముగియనుంది. నేటి గ్రాండ్‌ ఫినాలే కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటు గ్రాండ్‌ ఫినాలేను దుమ్ములేపడానికి బిగ్‌బాస్‌ యాజమాన్యం రంగస్థల నటులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్లయితే బుల్లితెర యాంకర్లు, పలువురు సెలబ్రిటీలు కూడా ఫినాలేకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ‘షూటింగ్‌ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్‌ మాత్రం మానను’ అని చెప్పుకొచ్చాడు. ఇక సెలబ్రిటీల హంగామాతో స్టేజీ దద్దరిల్లేట్లు తెలుస్తోంది.

మరోవైపు సోషల్‌ మీడియాలో లీకుల ప్రవాహం కొనసాగుతోంది. రాహుల్‌, వరుణ్‌లు బయటికి వచ్చేసి డాన్సులు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి ఎంతమాత్రం నిజం కాదని కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. గతంలో శ్రీముఖి విన్నర్‌ అంటూ ఓ ఫొటో వైరల్‌ కాగా ప్రస్తుతం రాహుల్‌ విజేతగా నిలిచాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నాగార్జున గ్రాండ్‌ ఫినాలే నేడు లైవ్‌ జరగబోతుందని బాంబ్‌ పేల్చాడు. ఇక నేటి గ్రాండ్‌ ఫినాలే సాయంత్రం 6 గంటకు ప్రసారం కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement