బిచ్చగాడా మజాకా! | Bichagada Mazaka movie will be a bigger hit than Bichagadu | Sakshi
Sakshi News home page

బిచ్చగాడా మజాకా!

Mar 14 2017 12:28 AM | Updated on Sep 5 2017 5:59 AM

బిచ్చగాడా మజాకా!

బిచ్చగాడా మజాకా!

ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌. నాగేశ్వరరావు దర్శకత్వంలో నూతన నిర్మాత బి. చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బిచ్చగాడా మజాకా’.

ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌. నాగేశ్వరరావు దర్శకత్వంలో నూతన నిర్మాత బి. చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. అర్జున్, నేహాదేశ్‌ పాండే జంటగా నటిస్తున్నారు. నిర్మాత చంద్రశేఖర్‌ మాట్లాడుతూ – ‘‘మూడు పాటలు, రెండు ఫైట్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. మేలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త నిర్మాతను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది.

 ‘బిచ్చగాడా మజాకా’ టైటిల్‌ వినగానే ఆశ్చర్యం అనిపించవచ్చు. సినిమా చూశాక ఈ టైటిలే యాప్ట్‌ అంటారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె. వెంకటేష్, కెమెరా: అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.కె రహమాన్, ఎస్‌.ఎమ్‌ భాషా, కథ–మాటలు–నిర్మాత: బి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: కేయస్‌ నాగేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement