8 ప్యాక్‌ శ్రీనివాస్‌

Bellamkonda Sreenivas to sport an 8-pack in his next - Sakshi

ఒకరేమో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌.. మరొకరేమో సంతోష్‌ శ్రీనివాస్‌. ఈ ఇద్దరి శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా షురూ అయింది. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘కందిరీగ, రభస, హైపర్‌’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 29న హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. ‘‘బెల్లంకొండ శ్రీనివాస్‌ కోసం సంతోష్‌ శ్రీనివాస్‌ పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.

ఈ చిత్రంలో బెల్లంకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం 8 ప్యాక్స్‌తో మేకోవర్‌ అయ్యారు. ‘అల్లుడు శీను, జయజానకి నాయక’ చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది.  రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుంది’’ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి ‘సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రాల ఫేమ్‌ డూడ్లే కెమెరామేన్‌గా పనిచేయబోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top