ఫ్లోరిడాలో లేడి విలన్ హల్‌చల్‌! | Baywatch baddie Priyanka Chopra is a vision in white as she starts filming movie reboot in Florida | Sakshi
Sakshi News home page

ఫ్లోరిడాలో లేడి విలన్ హల్‌చల్‌!

Mar 2 2016 9:56 AM | Updated on Sep 3 2017 6:51 PM

ఫ్లోరిడాలో లేడి విలన్ హల్‌చల్‌!

ఫ్లోరిడాలో లేడి విలన్ హల్‌చల్‌!

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది.

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. మొన్నటికిమొన్న ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఈ అమ్మడు.. తాజాగా ఫ్లోరిడాలోనూ తన అందచందాలతో హల్‌చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఫ్లోరిడాలోని బొకారాటన్‌ లో ప్రియాంక చోప్రా 'బేవాచ్‌' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమాలో లేడి విలన్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో తను కనిపించనుంది. ప్రఖ్యాత టీవీ షో అయిన 'బేవాచ్‌' సిరీస్‌ను సినిమా రూపంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ద్వారా హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఈ సినిమా షూటింగ్‌లోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. వైట్ లోకట్ బ్లౌజ్‌, వైట్ స్కర్ట్‌ లో క్రిస్పీ లుక్‌తో తొలిసారి షూటింగ్‌లో పాల్గొన్న ఈ మాజీ మిస్‌ వరల్డ్‌ హాట్ హాట్‌ ఫొటోలు ఇప్పుడు విదేశీ మీడియాలోనూ  హల్‌ చల్ చేస్తున్నాయి. ప్రియాంక విలన్‌గా నటిస్తున్న 'బేవాచ్' సినిమాలో డ్వేన్‌ జాన్సన్, జాక్ ఎఫ్రాన్‌, కెల్లీ రోహ్రబాక్, అలెజాండ్ర దాద్రిరియో వంటి హాలీవుడ్ స్టార్లు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement