నాకు వయసు తగ్గుతోంది : బాలయ్య

Balakrishna Speech At Basava Tarakam Cancer Hospital On Birthday Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి బాలకృష్ణ నేడు తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్‌ కాన్సర్‌ ఆసుపత్రిలో పిల్లల మద్య జరిపారు. ఆయన తన 59వ పుట్టినరోజును క్యాన్సర్‌ బారిన పడిన పిల్లలు, ఆసుపత్రి బృందం మధ్య  కేక్‌ను కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు అందరూ విష్‌ చేస్తున్నారని.. ‘అందరికీ వయసు పెరుగుతందని, కానీ తనకు తగ్గుతోందని చెప్పా’ అని అన్నారు. తనను ఆరకంగా విష్‌ చేయండని కోరారు. ఇక బాలయ్య తనదైన శైలిలో పద్యాలు చెబుతూ, మధ్యమధ్యలో తడబడుతూ అలా ప్రసంగించుకుంటూ వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ్య తన 105వ సినిమాను కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top