నిమ్మకూరులో ‘ఎన్టీఆర్‌’ టీం

Balakrishna And Director Krish At Nimmakuru - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్స్‌ను వెతికే పనిలో పడ్డారు చిత్రయూనిట్‌. ఎన్టీఆర్ బాల్యనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సిన లొకేషన్స్‌ పరిశీలించేందుకు ఆయన స్వగ్రామం నిమ్మకూరుకు వచ్చింది ఎన్టీఆర్ టీం. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ క్రిష్ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు నిమ్మకూరు, కొమరవోలులో పర్యటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను అభిమానులకు తెలియజేశారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘సినిమాలో నాన్నగారు, అమ్మ పుట్టిన ఊర్లను యాదాతధంగా చూపించాలని అనుకుంటున్నాం. ఈ గ్రామాలతో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ కథను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top