బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది | Bala krishna in gauthami puthra Sathakarni | Sakshi
Sakshi News home page

బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది

Oct 8 2016 3:00 PM | Updated on Sep 4 2017 4:40 PM

బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది

బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇది బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్...

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇది బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.

దసరా సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ శనివారం బాలయ్య సింహాసనం మీద కూర్చున్న రాయల్ లుక్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పౌరాణాక జానపద పాత్రల్లో అలరించిన బాలయ్య ఈ చారిత్రక పాత్రలోనే ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement