'అత్యుత్తమ దర్శకులలో ఆయన ఒకరు' | Bahl is among top directors of India, says Sanjay Kapoor | Sakshi
Sakshi News home page

'అత్యుత్తమ దర్శకులలో ఆయన ఒకరు'

Oct 20 2015 5:40 PM | Updated on Apr 3 2019 6:23 PM

'అత్యుత్తమ దర్శకులలో ఆయన ఒకరు' - Sakshi

'అత్యుత్తమ దర్శకులలో ఆయన ఒకరు'

దేశ అత్యుత్తమ దర్శకులలో వికాస్ బహల్ ఒకరని బాలీవుడ్ నిర్మాత, నటుడు సంజయ్ కపూర్ కితాబిచ్చాడు.

న్యూఢిల్లీ : దేశ అత్యుత్తమ దర్శకులలో వికాస్ బహల్ ఒకరని బాలీవుడ్ నిర్మాత, నటుడు సంజయ్ కపూర్ కితాబిచ్చాడు. బహల్ దర్శకత్వం వహించిన 'షాన్దార్' త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో తాను నటించేందుకు కేవలం దర్శకుడే కారణమని సంజయ్ పేర్కొన్నాడు. 'తేవర్' నిర్మిస్తున్న సమయంలో తన తదుపరి చిత్రంలో నటించాలంటూ దర్శకుడు  ఫోన్ చేశాడని గుర్తుచేసుకున్నాడు. సినిమాలపై ఎంతో ముందుచూపు ఉన్న అతికొద్ది మంది దర్శకులలో వికాస్ ఒకరని చెప్పుకొచ్చాడు.

ఈ మూవీలో సింధూకి చెందిన వ్యాపారిగా తాను కనిపిస్తానన్నాడు. వికాస్, తాను కలిసి తరుణ్ మన్సుఖానీ దగ్గరకు వెళ్లి మూడ్రోజులు సింధి భాషపై అవగహనా కోసం వెళ్లాం, అయితే కొద్దిసమయంలోనే వికాస్ మాత్రం సింధీ తరహాలో డైలాగ్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు. షాహిద్కపూర్, అలియా భట్, పంకజ్కపూర్, సుప్రియా పథక్ నటించిన 'షాన్దార్' మూవీ ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. వికాస్ బహల్ గతంలో 'క్వీన్' చిత్రంతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం అందరికి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement