బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల | baahubali, rudrama devi posters released | Sakshi
Sakshi News home page

బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల

Oct 18 2014 2:33 PM | Updated on Sep 2 2017 3:03 PM

బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల

బాహుబలి, రుద్రమదేవి పోస్టర్ల విడుదల

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న బాహుబలి, గుణశేఖర్ దర్శకత్వంలో భారీస్థాయిలో రూపొందుతున్న రుద్రమదేవి.. రెండు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న బాహుబలి, గుణశేఖర్ దర్శకత్వంలో భారీస్థాయిలో రూపొందుతున్న రుద్రమదేవి.. రెండు సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. గోన గన్నారెడ్డిగా తెలుగుజాతి పౌరుషాన్ని తన ఖడ్గంతో చూపిస్తున్న అల్లు అర్జున్.. ఆ వెనకాల జలపాతాలతో రుద్రమదేవి పోస్టర్ను విడుదల చేశారు.

ఇక ఆర్కామీడియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బాహుబలి పోస్టర్లో ప్రభాస్ ఒకచేత్తో గండ్రగొడ్డలి, మరోచేత్తో కత్తి పట్టుకుని యుద్ధం బ్యాక్డ్రాప్లో కనిపించేలా బాహుబలి పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ మీద ఆర్కా మీడియా లోగో, బాహుబలి టైటిల్, 2015 అన్న పదాల తప్ప మరేమీ లేవు. రుద్రమదేవి పోస్టర్ మీద మాత్రం, సినిమాకు సంబంధించిన అందరి పేర్లు వేశారు. చారిత్రక నేపథ్యాలతో రూపొందిస్తున్న ఈ రెండు సినిమాల పోస్టర్లు ఒకే సమయంలో విడుదల కావడం యాదృచ్ఛికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement