‘బాహుబలి’ రేంజ్ సినిమా! | Baahubali Range Movie in Sudeep | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’ రేంజ్ సినిమా!

Aug 17 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:41 AM

‘బాహుబలి’ రేంజ్ సినిమా!

‘బాహుబలి’ రేంజ్ సినిమా!

కన్నడ హీరో సుదీప్ మనకు సుపరిచితుడే. ‘ఈగ’లో ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

కన్నడ హీరో సుదీప్ మనకు సుపరిచితుడే. ‘ఈగ’లో ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. తర్వాత ‘యాక్షన్ 3డీ’, రాజమౌళి ‘బాహుబలి’ సినిమాల్లో నటించారు. ‘బాహుబలి’లో పర్షియన్ రాజుగా కట్టప్పతో కలసి తెరపై కనిపించింది కాసేపే అయినా మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడీ హీరో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ‘బాహుబలి’ తరహా పీరియాడికల్ యాక్షన్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ చేస్తారట. ‘‘ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘బాహుబలి’లాంటి సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను.
 
  కానీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఇప్పుడు నేను అంగీకరించిన సినిమాలు పూర్తయిన తర్వాత ఆ సినిమా స్టార్ట్ చేస్తా’’ అని సుదీప్ పేర్కొన్నారు. కన్నడలో సుదీప్ స్టార్ హీరో మాత్రమే కాదు, దర్శకుడు కూడా.  ‘సింగం’ రీమేక్ ‘కెంపెగౌడ’, ‘మిర్చి’, రీమేక్ ‘మాణిక్య’ తదితర చిత్రాలతో పాటు కన్నడంలో పలు స్ట్రయిట్ చిత్రాలకు సుదీప్ దర్శకత్వం వహించారు. నటుడిగా ఎంత పేరుందో దర్శకుడిగా కూడా అంతే మంచి పేరుంది. అయితే ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తై ఇప్పుడు ప్లాన్ చేస్తున్న భారీ పీరియాడికల్ మూవీ మరో ఎత్తు అవుతుందట.
 

Advertisement
 
Advertisement
Advertisement