బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ | baahubali producer about leakage rumors | Sakshi
Sakshi News home page

బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ

Apr 26 2017 2:18 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ - Sakshi

బాహుబలి లీక్పై నిర్మాత క్లారిటీ

ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2 సినిమాను పైరసీ భూతం భయపెడుతోంది. సాకేతింకంగా ఎన్ని

ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2 సినిమాను పైరసీ భూతం భయపెడుతోంది. సాంకేతికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. తాజాగా బాహుబలి 2 సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా షోస్ పడక ముందే ఈ ఫోటోస్ బయటకు రావటంతో సినిమా లీకైంది ప్రచారం మొదలైంది.

అయితే ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఇంత వరకు బాహుబలి 2కు సంబంధించిన ప్రదర్శనలు మొదలు కాలేదని తెలిపారు. అయితే పలు దేశాల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆయా దేశాల్లో సెన్సార్ సభ్యులకు ప్రదర్శన వేశామని తెలిపారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలు సెన్సార్ సమయంలో తీసినవే అయి ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement