
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు, రాజమౌళి కలసి సినిమా చేస్తారనే వార్త చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తున్నదే. ‘తప్పకుండా సినిమా చేస్తాం’ అని పలు సందర్భాల్లో మహేశ్, రాజమౌళి కూడా చెప్పారు. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయేది మహేశ్ చిత్రమే అని ఫిల్మ్‌నగర్ సమాచారం.
విశేషమేంటంటే ఈ సినిమా ద్వారానే మహేశ్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు హిందీలో ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేశారట దర్శక ధీరుడు రాజమౌళి. 2020 వరకూ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బిజీగా ఉంటారు. ఈలోపు మహేశ్ తన కమిట్‌మెంట్స్ (సుకుమార్, సందీప్ రెడ్డితో సినిమాలు) పూర్తి చేసుకుంటారని సమాచారం. రాజమౌళి–మహేశ్ కాంబినేషన్ సినిమా ఓ సరికొత్త పాయింట్‌తో ఉండబోతోందని ప్రచారంలో ఉంది. చూద్దాం.. ఈ కాంబినేషన్ ఎన్ని రికార్డ్‌లు సృష్టిస్తుందో.