
తన అసలు ప్రొఫైల్ ఫొటోతో సోషల్ మీడియా నకిలీ ఖాతా ఉందని నటుడు అరుణ్ గోవిల్ అభిమానులకు స్పషం చేశాడు. ఈ విషయాన్ని తన అసలు ట్విటర్ ఖాతాలో వీడియో ద్వారా గురువారం వెల్లడించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేను ఇచ్చిన సందేశాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన నా పేరుపై ఉన్న నకిలీ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అప్పుడే తెలిసింది నా పేరుపై నకిలీ ట్విటర్ అకౌంట్ ఉందని’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాను ఫాలో అవుతున్న అభిమానులు వెంటనే అన్‌ఫాలో కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో)
नमस्कार भाइयों एवं बहनो,
— Arun Govil (@arungovil12) April 6, 2020
एक आवश्यक सूचना आपको इस विडीओ के माध्यम से देना चाहता हूँ ।
आशा करताहूँ आप अवश्य समर्थन करेंगे !@realarungovil से विनती करें कि वो ऐसा ना करें ! pic.twitter.com/k7k9j8eWvi
కాగా రామనంద సాగర్ నిర్మించిన రామాయణంలో రాముడి పాత్ర పోషించాడు గోవిల్. రాముడి పాత్రతో ఆయన మంచి పేరు తెచ్చున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆయనకు అదరణ లభించింది. తన పేరుపై నకిలీ ఖాతా @realarungovil పేరుతో ఉందని.. తన అసలు ఖాతా @arungovil12 అని కూడా చెప్పారు. ఇక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సినిమాలకు, సీరియల్స్‌కు సంబంధించిన షూటింగ్‌లు ఆగిపోవడంతో సిరియల్స్‌ను పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహభారతం’, ‘శక్తిమాన్’, ‘రామయణం’ కూడా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ‘రామాయణాన్ని’ కూడా ప్రజలు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు గోవిల్ పేర్కొన్నారు. (‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’)