చవితికి కురుక్షేత్రం

Arjun's Kurukshetram gets a release date - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో  ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్‌’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీనివాస్‌ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.

నాకు తెలుగు ఫ్రెండ్స్‌ చాలామంది ఉన్నారు. అందుకే.. తెలుగు రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఉన్నా’’ అన్నారు. ‘‘దాదాపు 200కు పైగా థియేటర్స్‌లో మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. అర్జున్‌ 150వ సినిమాని మా బ్యానర్‌లో రిలీజ్‌ చేయడం హ్యాపీ’’  అన్నారు మీసాల శ్రీనివాస్‌. ‘‘అర్జున్‌ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేవన్నీ ‘కురుక్షేత్రం’లో ఉంటాయి. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top