ప్రేమకథ ఉందండోయ్! | Anushka is in love? | Sakshi
Sakshi News home page

ప్రేమకథ ఉందండోయ్!

Dec 7 2016 12:32 AM | Updated on Mar 21 2019 8:35 PM

ప్రేమకథ ఉందండోయ్! - Sakshi

ప్రేమకథ ఉందండోయ్!

నిజమే... అనుష్క ప్రేమలో పడ్డారు! మరి, పెళ్లి ఎప్పుడనేగా మీ డౌట్? వచ్చే ఏడాది ఉంటుందేమో! అనుష్క ఇంట్లో ఒప్పుకున్నారా?

నిజమే... అనుష్క ప్రేమలో పడ్డారు! మరి, పెళ్లి ఎప్పుడనేగా మీ డౌట్? వచ్చే ఏడాది ఉంటుందేమో! అనుష్క ఇంట్లో ఒప్పుకున్నారా? లాంటి ప్రశ్నలు అడగొద్దు. ఎందుకంటే, ఇది సినిమా పెళ్లేనండీ! అనుష్క ముఖ్యతారగా ‘పిల్ల జమిందార్’ ఫేమ్ జి. అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా ‘భాగమతి’. ఇందులో అనుష్క కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే సామర్థ్యం ఉన్న ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారట. ప్రభుత్వం, అధికారి.. అనగానే సమస్యలు వాటి పరిష్కారంతో సినిమా ఉంటుందేమో అనుకుంటున్నారా? ఇందులో ఓ చక్కని ప్రేమకథ కూడా ఉందండోయ్! అంటున్నారు యూనిట్ సన్నిహిత వర్గాలు.

‘జనతా గ్యారేజ్’లో మోహన్‌లాల్ కుమారుడిగా నటించిన ఉన్ని ముకుందన్ ఇందులో సోషల్ యాక్టివిస్ట్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరిలో అనుష్క ఎవరితో ప్రేమలో పడతారో.. ఎవర్ని పెళ్లి చేసుకుంటారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది. అన్నట్లు, ఇటీవల నిజ జీవితంలో బెంగుళూరులో ఒక బిజినెస్‌మ్యాన్‌తో అనుష్క ప్రేమ, పెళ్లి గురించి కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి ఎప్పుడు సమాధానం చెబుతారో! వెయిట్ అండ్ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement