బాహుబలి చివరి చిత్రమా? | Anushka Bahubali Last film ? | Sakshi
Sakshi News home page

బాహుబలి చివరి చిత్రమా?

Sep 17 2014 11:21 PM | Updated on Sep 2 2017 1:32 PM

బాహుబలి చివరి చిత్రమా?

బాహుబలి చివరి చిత్రమా?

అనుష్కకు బాహుబలినే చివరి చిత్రమా? ఇది ఆమె అభిమానులను కలత పెట్టిస్తున్న అంశం, ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన

అనుష్కకు బాహుబలినే చివరి చిత్రమా? ఇది ఆమె అభిమానులను కలత పెట్టిస్తున్న అంశం, ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన లింగా, అల్టిమేట్ స్టార్ అజిత్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. తెలుగులో చారిత్రాత్మక చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు. వీటిలో రుద్రమదేవి షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తమిళంలో రజనీకాంత్ సరసన నటిస్తున్న లింగా చిత్ర షూటింగ్ ఈ నెల చివరికి పూర్తి అవుతుందని సమాచారం.
 
 అజిత్ సరసన నటిస్తున్న చిత్రం జనవరికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. బాహుబలి చిత్రం మాత్రం వచ్చే ఏడాదిగానీ, ఆపై వచ్చే ఏడాది ప్రథమార్థంలో గానీ విడుదల కావచ్చని సమాచారం. అయితే అనుష్క త్వరలో నటనకు స్వస్తి చెప్పనున్నారని ఆమె చివరి చిత్రం బాహుబలినే అవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదంటున్నారుు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల ఒక నవ దర్శకుడు నటి అనుష్కను కలిసి కథ చెప్పారట. కథానాయిక చుట్టూ తిరిగే ఆ కథ అనుష్కకు బాగా నచ్చేసిందట. అయినా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
 
 సాధారణంగా ఇప్పుడు కాల్‌షీట్స్ లేవని చెప్పేసినట్లు తెలిసింది. నిజానికి లింగా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి అయితే అనుష్క చేతిలో అజిత్ చిత్రం, తెలుగు చిత్రం బాహుబలి మాత్రమే ఉంటాయి. అయితే త్వరలో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్న ప్రచారమవుతోంది. అనుష్కకు కాబోయే వరుడు ప్రముఖ వ్యాపార వేత్త అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అనుష్క సంసార జీవితానికే పరిమితం కావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement