యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....! | Anjali Sang song | Sakshi
Sakshi News home page

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....!

Mar 9 2016 11:23 PM | Updated on Aug 20 2018 2:58 PM

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....! - Sakshi

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....!

కథానాయిక అంజలి కూడా సింగర్ అవతారమెత్తేశారు. ప్రస్తుతం ఆమె ‘చిత్రాంగద’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు.

 కథానాయిక అంజలి కూడా సింగర్ అవతారమెత్తేశారు. ప్రస్తుతం ఆమె ‘చిత్రాంగద’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం కోసం ఆమె ఓ పాట పాడారు. ‘డ...డ... డాంగ్... డాంగ్... డంగ్ చుక్... డంగ్ చుక్ యాపిల్ సెల్‌ఫోన్... యాపిల్ రేటుకు వస్తే.... ఆషాఢం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే...’ అంటూ పల్లవితో ఈ పాట సాగుతుంది.
 
  సెల్వ గణేశన్, స్వామినాథన్ సంగీత సారథ్యంలో అంజలి ఇటీవలే ఈ పాట రికార్డింగ్‌ను పూర్తి చేశారు. విశేషం ఏమిటంటే, ఈ పాట తమిళ వెర్షన్‌ను కూడా  అంజలి పాడారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలాఖరులో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement