హ్యాట్రిక్ ప్లాన్లో అనిల్ | anil ravipudu next movie with ram | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ ప్లాన్లో అనిల్

Jun 10 2016 3:17 PM | Updated on Sep 2 2018 5:18 PM

హ్యాట్రిక్ ప్లాన్లో అనిల్ - Sakshi

హ్యాట్రిక్ ప్లాన్లో అనిల్

పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అనిల్ రెండో ప్రయత్నంలోనూ ఆకట్టుకున్నాడు.

పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అనిల్ రెండో ప్రయత్నంలోనూ ఆకట్టుకున్నాడు. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కించి మంచి వసూళ్లను సాధించాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్గా మంచి విజయాలు సాధించటంతో అనిల్ రావిపూడికి స్టార్ హీరోల నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి.

ఒక దశలో నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు అనిల్ దర్శకత్వం వహించనున్నాడని, రామారావు గారు పేరుతో అనిల్ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందన్న వార్తలు వినిపించాయి. అయితే బాలయ్య క్రిష్ సినిమాకు ఓకే చెప్పడంతో అనిల్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా తన మూడో సినిమాకు మరో స్టార్ హీరోను లైన్లో పెడుతున్నాడు పటాస్ డైరెక్టర్.

చాలాకాలం తరువాత నేను శైలజ సినిమాతో బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించిన ఎనర్జిటిక్ హీరో రామ్తో తన మూడో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసున్న రామ్, ఆ సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement