ఆ ఇద్దరి బాటలో ఆండ్రియా | Andrea Jeremiah in Double Role Soon | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి బాటలో ఆండ్రియా

Apr 10 2019 12:07 PM | Updated on Apr 10 2019 12:07 PM

Andrea Jeremiah in Double Role Soon - Sakshi

సినిమా: నటి ఆండ్రియా కూడా వారి బాటలో పయనిస్తోంది. ఈ అమ్మడు సంచలన నటినే కాదు బహుభాషా నటి కూడా. అంతే కాదు ఈమెలో మంచి గాయని ఉంది. రచయిత్రి కూడా. ఇక చాలెంజింగ్‌ పాత్రలకు వెనుకాడే నటి కానే కాదు. ఈ మధ్య ధనుష్‌ కథానాయకుడిగా నటించిన వడచెన్నైలో భర్తను చంపిన వ్యక్తితో కాపురం చేసే విలక్షణ పాత్రలో నటించే ధైర్యం చేసింది. అలా ఇమేజ్‌కు భయపడని ఆండ్రియా తాజా ద్విపాత్రాభినయానికి సిద్ధం అవుతోంది.

ఇప్పుడు నయనతార, అమలాపాల్‌ వంటి నటీమణులు ద్విపాత్రాభినయం చేసేస్తున్నారు. తాజాగా నటి ఆండ్రియా కూడా ఆదే బాటలో పయనిస్తోంది. ఈ సంచలన నటి మాళిగై అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇది ఫాంటసీతో కలిసిన హర్రన్‌ సన్నివేశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కన్నడ దర్శకుడు దిల్‌ సత్య తెరకెక్కించనున్న ఇందులో ఆండ్రియా పోలీస్‌ అధికారిణిగా, మహారాణిగా ద్విపాత్రాభినయం చేయబోతోంది. ఒక కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్‌ కోసం ఒక ప్రాంతానికి వెళ్లిన పోలీస్‌అధికారి ఆండ్రియాకు ఆక్కడ తన గతం గురించి తెలుస్తుందని, ఆ తరువాత ఏం జరిగిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రంగా మాళిగై ఉంటుందని తెలిసింది. ఇందులో కన్నడ నటుడు కార్తీక్‌ జయరామన్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్, మనోబాలా, అశుతోష్‌ రాణా, జాంగ్రి మధుమిత, ఒక తెలుగు హాస్యనటుడు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement