నిర్మాణాంతర కార్యక్రమాల్లో ‘అమ్మమ్మగారిల్లు’ | Ammammagarillu Post Production In Full Swing | Sakshi
Sakshi News home page

May 1 2018 4:18 PM | Updated on May 1 2018 4:18 PM

Ammammagarillu Post Production In Full Swing - Sakshi

స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమాకు సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్‌కు  ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డీటీఎస్ మిక్సింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది.అలాగే  మేడే సంద‌ర్భంగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ‘చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్‌తో వస్తున్న సినిమా కావ‌డంతో మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి వివేష స్పంద‌న ల‌భిస్తోంది.  పలువురు సినీ పెద్ద‌లు కూడా టీజ‌ర్ చూసి ఎంతో బాగుంద‌ని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement