అందరి కళ్లూ రెజీనా పైనే! | Amitabh, Arshad and Regina shake a leg as they announce Ankhen 2 | Sakshi
Sakshi News home page

అందరి కళ్లూ రెజీనా పైనే!

Aug 18 2016 11:38 PM | Updated on Sep 4 2017 9:50 AM

యస్.. ఇప్పుడందరి కళ్లూ రెజీనా పైనే ఉన్నాయి. ఇక్కడ కాదు.. ముంబైలో. రెజీనా కొట్టేసిన అవకాశం అలాంటిది.

యస్.. ఇప్పుడందరి కళ్లూ రెజీనా పైనే ఉన్నాయి. ఇక్కడ కాదు.. ముంబైలో. రెజీనా కొట్టేసిన అవకాశం అలాంటిది. ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ‘ఆంఖే 2’లో రెజీనా చాన్స్ దక్కించుకు న్నారు. ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అమితాబ్ బచ్చన్, ఇతర కీలక పాత్రలు చేస్తున్న అర్షద్ వార్శి, అర్జున్ రామ్‌పాల్, రెజీనా తదితరులు ర్యాంప్ వాక్ చేశారు. గ్లామరస్‌గా కనిపించిన రెజీనా పైనే అందరి కళ్లూ.
 
 అసలు హిందీ సినిమా గురించి రెజీనా కలలో కూడా ఊహించలేదట. హఠాత్తుగా ఈ అవకాశం రావడంతో ఎగ్జైట్ అవుతున్నారామె. ఇంతకీ  రెజీనాకి ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. చిత్రదర్శకుడు అనీస్ బజ్మీ సౌత్‌లో రెజీనా చేసిన సినిమాలు చూసి, ‘ఆంఖే 2’కి సెలక్ట్ చేశారు. ఈ చిత్రంలో రెజీనా చాలా గ్లామరస్‌గా కనిపిస్తారట. ‘‘హిందీ తెరపై కనిపించని హీరోయిన్‌ని కీలక పాత్రకు తీసుకోవాలనుకున్నాను.
 
 ఆ అమ్మాయికి డ్యాన్సులు బాగా  రావాలి. ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించాలి. రెజీనా గురించి తెలిసి, తను యాక్ట్ చేసిన సినిమాలు చూశాను. వెరీ టాలెంటెడ్. అందుకే ఈ సినిమాకి తీసుకున్నాను’’ అని అనీస్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా ఇలియానా నటించనున్నారు. ఇదిలా ఉంటే.. 2002లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఆంఖే’కి ఇది సీక్వెల్. 14 ఏళ్ల తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే జనవరిలో ఆరంభమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement