బుల్లితెరపై అమల | Amala to make her small screen debut | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై అమల

Jul 15 2014 12:40 AM | Updated on Jul 15 2019 9:21 PM

బుల్లితెరపై అమల - Sakshi

బుల్లితెరపై అమల

నాగార్జున తరువాత ఇప్పుడు ఆయన సతీమణి అమల వంతు వచ్చినట్లుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర వీక్షకులను నాగ్ ఆకట్టుకుంటూ ఉంటే,

 నాగార్జున తరువాత ఇప్పుడు ఆయన సతీమణి అమల వంతు వచ్చినట్లుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర వీక్షకులను నాగ్ ఆకట్టుకుంటూ ఉంటే, తాజాగా అమల ఓ టీవీ సీరియల్‌కు పచ్చ జెండా ఊపినట్లు కోడంబాకమ్ కబురు. తమిళంలో త్వరలో రానున్న ఓ టీవీ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. అందులో ఆమె ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల ఆ టీవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సదరు టీవీ సిరీస్ పేరు -‘ఉయిర్మే’.
 
  ‘‘ఇప్పటికే రకరకాల బాధ్యతల్లో తలమునకలుగా ఉంటున్నాను కాబట్టి, ఎంతో ప్రత్యేకమైన పాత్ర అయితే కానీ సినిమాలో అయినా, సీరియల్‌లో అయినా నటించడానికి ఒప్పుకోవట్లేదు. ఈ స్క్రిప్టు నాకు బాగా నచ్చడంతో, నో చెప్పలేకపోయా’’ అని అమల వ్యాఖ్యానించారు. మొత్తం 12 మంది డాక్టర్ల జీవితాలు, వారి కుటుంబాలు, రోగుల చుట్టూ నడిచే ఈ టీవీ షో ఆగస్టులో ప్రసారం ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement