బన్నీ, హరీష్కే ఫిక్స్ అయ్యాడు | Allu Arjuns Next With Harish Shankar | Sakshi
Sakshi News home page

బన్నీ, హరీష్కే ఫిక్స్ అయ్యాడు

Jun 25 2016 12:59 PM | Updated on Sep 4 2017 3:23 AM

బన్నీ, హరీష్కే ఫిక్స్ అయ్యాడు

బన్నీ, హరీష్కే ఫిక్స్ అయ్యాడు

సరైనోడు సక్సెస్ తరువాత చాలా రోజులుగా కాలీగా ఉన్న అల్లు అర్జున్ ఫైనల్గా తన నెక్ట్స్ సినిమాను కన్ఫామ్ చేశాడు. ముందుగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో ఎక్స్పరిమెంటల్ సినిమా...

సరైనోడు సక్సెస్ తరువాత చాలారోజులుగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను కన్ఫామ్ చేశాడు. ముందుగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో ఎక్స్పరిమెంటల్ సినిమా చేయాలని భావించిన బన్నీ, తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మరో తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో మాస్ మాసాలా ఎంటర్టైనర్ను ప్లాన్ చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

ఫైనల్గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత బన్నీ, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు బన్నీ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement