మై బేబి అయాన్‌.. నా సంతోషం‌: బన్నీ | Allu Arjun Photos Birthday Photos in Instagram | Sakshi
Sakshi News home page

మై బేబి అయాన్‌.. నా సంతోషం‌: బన్నీ

Apr 3 2018 5:00 PM | Updated on Oct 22 2018 6:10 PM

Allu Arjun Photos Birthday Photos in Instagram - Sakshi

హీరో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ ఫొటో

నేడు హీరో అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అయాన్‌తో కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో హాల్‌ చల్‌ చేస్తున్నాయి. ‘నా బెస్టీకి బర్త్‌డే శుభాకాంక్షలు. మై బేబి అయాన్‌.. నా సంతోషం‌’ అని పోస్టు చేశారు. అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి కూడా అయాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’..  ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సోల్జర్‌ సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ  చిత్రాన్ని మేలో రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement