breaking news
Ayan
-
అందరి అమ్మ అల్కాశర్మ
భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం. దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్‌కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్‌ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది. ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు. అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్‌లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు. ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ. – యాసీన్ -
అల్లు అర్జున్ ఇంట్లో క్యూట్ దెయ్యాలు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ ఇంట్లో రెండు దెయ్యాలు పడ్డాయి. అవును.. అవి మాములు దెయ్యాలు కావు.. అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసే క్యూట్ దెయ్యాలు. ఈ పిల్ల దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ సతీమణి ఈ క్యూట్ దెయ్యాల వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఉన్నచోటే వినోదాన్ని అందిస్తోంది స్నేహ. పిల్లలకు రకరకాల గెటప్ వేసి ఆడిస్తోంది. వాటికి సంబంధిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది స్నేహ. తాజాగా ఆమె షేర్ చేసిన దెయ్యాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అందులో అర్హ, అయాన్లు తెల్లటి వస్త్రాలు ధరించి, దెయ్యాల గెటప్‌లో ఉన్నారు. ముఖాలకు కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ డ్యాన్స్ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. . ఇక ఇందులో బుల్లి అర్హ వేసిన చిన్న స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
బాబాయ్‌తో కలిసి చిందులు..
హైదరాబాద్ : హీరో అల్లు శిరీష్.. తన సోదరుల పిల్లలతో కలిసి సందడి చేశారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ, అల్లు వెంకట్ కుమార్తె అన్వితలతో కలిసి ఓ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఫన్ విత్ శిరి బాబాయ్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో అన్విత, అయాన్లు తమకు తోచిన స్టేప్పులు వేశారు. అర్హ మాత్రం పక్కన ఉన్న అయాన్, వెనకాల ఉన్న శిరీష్ ఏం చేస్తున్నారో చూసుకుంటూ.. చాలా క్యూట్ క్యూట్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై శిరీష స్పందిస్తూ.. ‘2020లో అంకుల్ విధుల్ ఇవ్వే.. అందులో పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శిరీష్ నటించిన చివరి చిత్రం ఏబీసీడీ విడుదలై నేటికి(మే 17) ఏడాది పూర్తి అయింది. అయితే ఇప్పటివరకు శిరీష్ తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (చదవండి : బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ) View this post on Instagram Fun with Siri Babai ❤️ A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on May 16, 2020 at 2:47am PDT -
మై బేబి అయాన్.. నా సంతోషం: బన్నీ
నేడు హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అయాన్‌తో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. ‘నా బెస్టీకి బర్త్‌డే శుభాకాంక్షలు. మై బేబి అయాన్.. నా సంతోషం’ అని పోస్టు చేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా అయాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’.. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది. -
ఎంత సక్కగున్నావో
...బుజ్జి అయాన్ని చిట్టిబాబు గెటప్‌లో చూసినవాళ్లు ఇలా అనకుండా ఉండలేకపోయారు. బుడతడు అచ్చంగా తన మామ రామ్‌చరణ్ గెటప్‌లో దిగిపోయాడు. ఫొటోలు చూశారుగా. చిన్న చిట్టిబాబు భలే ముద్దుగా ఉన్నాడు కదూ. ‘‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు! హార్డ్‌కోర్ చరణ్ మామ ఫ్యాన్. ‘రంగస్థలం’ సాంగ్స్‌ను ప్లే చేయమని ప్రతి రోజూ అయాన్ అల్లరి చేస్తున్నాడు. ఎంత సక్కగున్నావ్ బే’ అని చిట్టిబాబు గెటప్‌లో ఉన్న కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లుఅర్జున్. ‘లైక్ మామ లైక్ అల్లుడు’ అన్నారు అల్లుఅర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, చిట్టిబాబు బ్రదర్ కె. కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, సీనియర్ నరేష్, అనసూయ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఎల్కేజీ చిన్నారి అదృశ్యం
పాఠశాల సిబ్బంది గమనించకపోవటంతో ఓ చిన్నారి స్కూలు నుంచి ఎటో వెళ్లిపోయాడు. వనస్థలిపురంలోని గౌతం మోడల్ స్కూలులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఎల్కేజీ స్టూడెంట్ అయాన్ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బంది ఈ విషయం గమనించలేదు. అన్నం పెట్టేందుకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకపోయేసరికి సిబ్బందిని నిలదీశారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న సిబ్బంది తెల్లమొఖం వేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజి సాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కుమారుడి క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు ఇమ్రాన్!
నాలుగేళ్ల తన కుమారుడి చికిత్స కోసం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విదేశాలకు వెళ్లనున్నారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయన్ కు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ఇటీవలే వైద్యులు గుర్తించారు. అయితే తొలి దశలోనే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడికి విదేశాల్లో కెమోథెరఫీ చికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు. జనవరి 15 తేదిన ఆయన్ కు సర్జరీ చేసి కిడ్నీ నుంచి ట్యూమర్ ను వ్యైద్యులు విజయవంతంగా తొలగించారు. మంగళవారం ఆయన్ ను ఆస్పత్రి నుంచి విడుదల చేయనున్నారు. ఇటీవల క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ వ్యాధికి గురవ్వడంతో అమెరికాలో కెమోథెరపీ చికిత్స నిర్వహించారు. ఆయన్ కు అమెరికాలో కెమోథెరఫి నిర్వహించాలని ఇమ్రాన్ కు యువరాజ్ సింగ్ సూచించినట్టు తెలుస్తోంది.


