ఆఖరి ఓటు వేసిన అల్లరి నరేష్ | Allari Naresh Cast Their Vote for MAA Elections 2019 | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్

Mar 10 2019 2:54 PM | Updated on Mar 10 2019 2:55 PM

Allari Naresh Cast Their Vote for MAA Elections 2019  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికలు (మా) పోలింగ్‌ ముగిసింది. ‘మా’ లో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా, కేవలం 472 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా... హీరో అల్లరి నరేష్‌ ఆఖరిగా ఓటు వేయడంతో పోలింగ్‌ ముగిసింది. రాత్రి 8గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ‘మా’  ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీనియర్‌ నటులు శివాజీరాజా, నరేశ్‌ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సవాళ్లు.. ప్రతిసవాళ్లు, ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు.  చదవండి...(‘మా’ హీరో ఎవరు?)

Advertisement
 
Advertisement
Advertisement