కాంచన రీమేక్‌లో...

Akshay Kumar returning to horror comedy with Kanchana remake - Sakshi

టికెట్టు కొనుక్కొని మరీ భయపడటానికి థియేటర్లకు వెళుతుంటారు హారర్‌ సినిమాల ప్రేమికులు. వాళ్లు ఏమాత్రం నిరుత్సాహపడకుండా భయపెట్టడానికి రెడీ అవుతున్నారు అక్షయ్‌ కుమార్, రాఘవా లారెన్స్‌. సౌత్‌లో హారర్‌ చిత్రాల సిరీస్‌ ‘కాంచనకు’ ఎంత క్రేజ్‌ ఉందో తెలుసు. ఈ సిరీస్‌ ద్వారా దర్శకుడిగా పాపులర్‌ అయ్యారు లారెన్స్‌. ఇప్పుడు నార్త్‌ ఆడియన్స్‌ను భయపెట్టడానికి సిద్ధం అయ్యారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ‘కాంచన’ సినిమాను రీమేక్‌ చేయడానికి ప్లాన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ్ల ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘లక్ష్మీ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారట. శోభిత ధూళ్లిపాళ్ల ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top