‘ఒకే ఒక్కడు అక్షయ్‌’ | Akshay Kumar Only Indian in Forbes Highest Paid Celebrities List | Sakshi
Sakshi News home page

టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌

Jun 5 2020 12:03 PM | Updated on Jun 5 2020 1:13 PM

Akshay Kumar Only Indian in Forbes Highest Paid Celebrities List - Sakshi

టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌కు చోటు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఒక్కరికే చోటుదక్కింది. జూన్‌ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో బాలీవుడ్‌ ఖిలాడీ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగిన టాప్‌ 100 సెలబ్రిటీల సరసన చేరారు. కాస్మెటిక్‌ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్‌ రూ 4453 కోట్ల ఆర్జనతో అగ్రస్ధానంలో నిలిచిన ఈ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు 52వ స్దానం లభించింది. 2019 జాబితాలో 33వ స్ధానంలో నిలిచిన అక్షయ్‌ కుమార్‌ ఈసారి 19 ర్యాంకులను కోల్పోయినా టాప్‌ 100లో తన స్ధానం పదిలపరుచుకున్నారు.

గత ఏడాది అక్షయ్‌ రాబడి రూ 490 కోట్లు కాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సంపదపై కరోనా వైరస్‌ ప్రభావం పడిందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. అమెజాన్‌ ప్రైమ్‌తో అక్షయ్‌ కుమార్‌ డిజిటల్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ ఏడాది అత్యధిక రాబడి పొందే టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కేందుకు దోహదపడింది. అక్షయ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌ సిరీస్‌ కోసం రూ 75 కోట్లతో ఒప్పందం చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక బెల్‌ బాటమ్‌, బచ్చన్‌ పాండే వంటి రానున్న సినిమాల కోసం రూ 100 కోట్ల దాకా వసూలు చేశారని నివేదిక వెల్లడించింది. మరోవైపు ఫోర్బ్స్‌ టాప్‌ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా కైలీ జెన్నర్‌, కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్‌ మెస్పీ, టేలర్‌ పెర్రీ, నేమార్‌, హోవర్డ్‌ స్టెమ్‌, లెబ్రాన్‌ జేమ్స్‌, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు.

చదవండి : సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement