'మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు చెప్పామా?' | Akshara Hassan and Tanuj Virwani vow to remain friends for life | Sakshi
Sakshi News home page

'మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు చెప్పామా?'

Apr 5 2016 1:21 PM | Updated on Sep 3 2017 9:16 PM

'మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు చెప్పామా?'

'మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు చెప్పామా?'

కమల్ హాసన్ తనయ అక్షర హాసన్, తనుజ్ విర్వానిల రిలేషన్షిప్ ముగిసిందని, ఇక మీదట స్నేహితులుగా ఉండాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కమల్ హాసన్ తనయ అక్షర హాసన్, తనుజ్ విర్వానిల రిలేషన్షిప్ ముగిసిందని, ఇక మీదట స్నేహితులుగా ఉండాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా అక్షర, తాను డేటింగే చేయలేదని తనుజ్ చెబుతున్నాడు. తామిద్దరం డేటింగ్ చేస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదన్నాడు.

తమ అనుబంధం పట్ల అక్షర తల్లి సారిక, తన తల్లి రతి అగ్నిహోత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలను తనుజ్ తోసిపుచ్చాడు. తమ గురించి అక్షర, తన కుటుంబ సభ్యులకు తెలుసునని వెల్లడించాడు. గతంలో ముంబై శివారు ప్రాంతాల్లో పలుమార్లు అక్షర, తనుజ్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement