కొత్త గెటప్‌

Akkineni Akhil next movie with Prashanth Varma - Sakshi

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు అఖిల్‌. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌  ఈ మధ్యనే ప్రారంభమైంది. అప్పుడే తదుపరి సినిమాను లైన్‌లో పెడుతున్నారట అఖిల్‌. ‘అ!, కల్కి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని తెలిసింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. ఇందులో అఖిల్‌ లుక్‌ సరికొత్తగా, ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందట. అందుకే ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top