ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది | Akkadokaduntadu movie latest updates | Sakshi
Sakshi News home page

ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది

Jan 27 2019 3:26 AM | Updated on Jan 27 2019 3:26 AM

Akkadokaduntadu movie latest updates - Sakshi

శివ కంఠమనేని, వెంకటేశ్వరరావు

శివ కంఠమనేని టైటిల్‌ రోల్‌లో రామ్‌ కార్తీక్, రసజ్ఞ, శివ హరీశ్, అలేఖ్య హీరో హీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్‌ తెరకెక్కించిన  చిత్రం ‘అక్కడొకడుంటాడు’. కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ –‘‘టైటిల్‌లానే సినిమా కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. పెళ్లి కావాల్సిన  ఓ ప్రేమ జంట అనుకోకుండా యాక్సిడెంట్‌లో చిక్కుకుని అందులో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడవిలోకి ప్రవేశిస్తారు.

అక్కడ నా పాత్ర ప్రవేశిస్తుంది. నాకు, వాళ్లకూ మధ్య ఏం జరిగింది అన్నది కథ. నేను అంధుడి పాత్రలో కనిపిస్తా’’ అన్నారు. ‘‘30 ఏళ్ల నుంచి సినిమాతో అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం పేపర్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కనిపిస్తూనే ఉంటాయి. ఆ కాన్సెప్ట్‌ మీద సినిమా తీశాం. క్వాలిటీగా తీశాం. మా సినిమా చూసి నచ్చడంతో రిలీజ్‌ విషయంలో నిర్మాత సి. కల్యాణ్‌గారు సహకారం అందించారు’’ అన్నారు రావుల వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement